పాపం.. బన్నీకి దర్శకుడు కరువు !
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్’తో సినిమా చేసేందుకు దర్శకులు క్యూ కడుతుంటారు. ఐతే, ప్రస్తుతం బన్నీకి దర్శకుడు కరువయ్యాడు. ‘నా పేరు సూర్య’ తర్వాత బన్నీతో సినిమా చేయబోయే దర్శకుల లిస్టులో కొరటాల శివ, వి.ఐ ఆనంద్, విక్రమ్ కుమార్’ల పేర్లు వినిపించాయి. వీరిలో బన్నీ విక్రమ్’కు అవకాశమిచ్చాడు. ఐతే, విక్రమ్ ఇంకా స్క్రిప్ట్ ని పూర్తి చేయలేదు. దీంతో బన్నీ మరో దర్శకుడి వైపు చూస్తున్నట్టు సమాచారమ్.
ఈ నేపథ్యంలోనే బన్నీ సినిమా కోసం హరీష్ శంకర్ పేరు బయటికొచ్చింది. ఆయన దగ్గర బన్నీ కోసం స్క్రిప్ట్ రెడీగా ఉందట. మెగా అభిమానులు మాత్రం బన్నీ కోసం మళ్లీ హరీష్ అంటే పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. ఇప్పటికే ‘డీజే’ ఫలితాన్ని చూశాం. మరోసారి హరీష్’తో వెళ్లడం రిస్క్ చేయడమేననే కామెంట్స్ వినబడుతున్నాయి. మరీ.. బన్నీ విక్రమ్ కుమార్ స్కిప్ట్ రెడీ చేసే వరకు వెయిట్ చేస్తాడా ? హరీష్’తో అడ్జెస్ట్ అవుతాడా ?? అన్నది చూడాలి.