ఆ ‘రైటర్ ఆత్మహత్యా యత్నం’ చేయలేదట !
తెలుగు రైటర్, డైరెక్టర్ రాజసింహ ఆత్మహత్యా యత్నం చేశాడన్న న్యూస్ ఇండస్ట్రీని షాక్’కు గురిచేసింది. ఆర్థిక ఇబ్బందులు, డిప్రెషన్’లోకి వెళ్లడం ఆత్మహత్యా యత్నానికి కారణమనే ప్రచారం జరిగింది. ఐతే, కాస్త కోలుకొన్న రాజసింహ ఆత్మహత్యా యత్నంపై క్లారిటీ ఇచ్చారు.
“నేను ప్రస్తుతం ముంబైలో ఉన్నాను. గడిచిన రాత్రి కొంచెం ఆరోగ్యపరమైన సమస్యలు రావడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళాను. నాకు డయాబెటిస్ ఉంది. ఆ సమయంలో నా పక్కన ఎవరు లేకపోవడం వల్ల అలా జరిగింది. నా గురించి కంగారు పడ్డ వారందరికీ ధన్యవాదాలు. ఇంకో రెండు మూడు రోజుల్లో హైదరాబద్ వచ్చి మిమ్మల్ని కలుస్తా”నని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు.
ఇప్పటికే రాజసింహ మంచి రైటర్ అనిపించుకొన్నాడు. శంకర్‌దాదా ఎంబీబీయస్, బొమ‍్మరిల్లు, ఝుమ్మంది నాదం, అనగనగా ఓ ధీరుడు, రుద్రమదేవి సినిమాలకు ఆయన రచయితగా పనిచేశారు. గుణశేకర్ ‘రుద్రమదేవి’ సినిమాలోని గోనగన్నా రెడ్డి పాత్రకు మాటలు రాసింది రాజసింహనే. సందీప్-నిత్యామీనన్ జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఒక అమ్మాయి తప్ప’ సినిమాకు దర్శకత్వం వహించారు.
Director #Rajasimha issues a clarification on the reports of making suicide attempt. He is fine and will be coming to Hyderabad in couple of days pic.twitter.com/XKzuSbAVXS
— M B Varaprasad (@MBVaraprasad4) May 18, 2018