‘ఎన్టీఆర్’కు దర్శకుడు ఫిక్స్

మాహానటుడు ‘నందమూరి తారక రామారావు బయోపిక్’ని ఆయన తనయుడు, హీరో బాలకృష్ణ తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు. తేజ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కాల్సింది. ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. దీంతో ‘ఎన్టీఆర్’ డీల్ చేసే దర్శకుడు ఎవరు ? అన్నది ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్ బయోపిక్ కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కృష్ణవంశీ పేర్లు వినిపించాయి. చివరగా దర్శకుడు క్రిష్ పై బాలయ్య భారం మోపాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన బాలయ్య వందో సినిమా ‘గౌతమీపుత్రశాతకర్ణి’ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. క్రిష్ ప్రతిభని దగ్గర్నుంచి చూసిన బాలయ్య.. ఎన్టీఆర్ బయోపిక్ ని ఆయన చేతిలోనే పెట్టేశాడు.

ప్రస్తుతం క్రిష్ కంగనా ‘మణికర్ణిక’తో బిజీగా ఉన్నాడు. మరోవైపు, బాలయ్య వివి. వినాయక్ తో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ఎన్ టీఆర్ బయోపిక్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.