బన్నీకి బిగ్ షాక్ ఇచ్చిన నాని
నేచురల్ స్టార్ నాని స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్’కి బిగ్ షాకిచ్చినట్టు సమాచారమ్. బన్నీకి వచ్చిన బిగ్ ఆఫర్’ని నాని లాగేసుకొన్నట్టు ఫిల్మ్ నగర్ చెప్పుకొంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్’గా హోస్ట్’గా వ్యవహరించిన ‘తెలుగు బిగ్ బాస్ సీజన్ – 1’ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఐతే, బిగ్ బాస్ – 2కు తారక్ అందుబాటులో ఉండటం లేదు. ఆయన త్రివిక్రమ్ సినిమాతో బిజీ అయిపోయాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ – 2 కోసం నాని తీసుకొన్నారు. త్వరలోనే నాని హోస్ట్’గా తెలుగు బిగ్ బాస్ సీజన్ – 2 ప్రారంభం కానుంది.
బిగ్ బాస్ కోసం నాని ఎంపిక కంటే ముందు బన్నీ పేరు వినిపించింది. బిగ్ బాస్ నిర్వాహకులు బన్నీని సంప్రదించారు. ‘నా పేరు సూర్య’ సినిమా తర్వాత మరో సినిమాని ఓకే చేయని బన్నీ.. బిగ్ బాస్ ఆఫర్ ని ఓకే చెద్దానుకొన్నాడట. కాస్త ఆలోచించుకొని నిర్ణయం చెబుతానన్నాడట. ఐతే, ఈలోపు ఆ ఆఫర్ ని నాని తన్నేసుకుపోయాడని చెప్పుకొంటున్నారు. ఇదే నిజమైతే నాని బన్నీకి బిగ్ షాక్ ఇచ్చాడన్న మాట నిజమైనట్టే.
ఇక, బిగ్ బాస్ సీజన్ – 2 కోసం నానికి భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీజన్ మొత్తానికి రూ. 3.5కోట్లు ఇస్తున్నారట. తారక్ తో పోలిస్తే ఇది తక్కువే. ఐతే, నాని రెగ్యూలర్ గా తన సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే బిగ్ బాస్ సీజన్ – 2ని డీల్ చేయబోతున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా నాని తారక్ ని మైమరిపిస్తాడేమో చూడాలి. [one_fourth] [/one_fourth] [one_fourth]