ఉదయ్ కిరణ్ బయోపిక్’పై తేజ మాట
‘మహానటి’ సావిత్రి బయోపిక్ బ్లాక్ బస్టర్ హిట్’గా నిలిచింది. అంతకుమించి గొప్ప సినిమా అనిపించుకొంది. ఇప్పుడీ సినిమా స్పూర్తితో తెలుగులో మరిన్ని బయోపిక్’లు రాబోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఉదయ్ కిరణ్, సౌందర్యల బయోపిక్’లకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పుకొంటున్నారు. వీటిలో ఉదయ కిరణ్ బయోపిక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘కాబోయే అల్లుడు’ టైటిల్ ఫిక్సయ్యింది. త్వరలోనే దీనిపై తేజ ప్రకటన చేయనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఉదయ్ కిరణ్’గా రానా దగ్గుపాటి, మెగాస్టార్ చిరంజీవి పాత్రలో జగపతి బాబు కనిపించనున్నారని చెప్పుకొన్నారు. దీంతో దర్శకుడు తేజ మెగా ఫ్యామిలీ ఢీకొనేందుకు రెడీ అయ్యాడనే కామెంట్స్ వినిపించాయి. చివరగా ఉదయ్ కిరణ్ బయోపిక్’పై తేజ స్పందించారు. ఉదయ్ కిరణ్ తనకి మంచి స్నేహితుడు. అందువలనే ఇలాంటి న్యూస్ పుట్టుకొచ్చినట్టుంది. తాను ఉదయ కిరణ్ బయోపిక్ ని తీయడం లేదు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. మరీ.. ఇప్పటికైనా ‘కాబోయే అల్లుడు’పై కామెంట్స్ కు పులిస్టాప్ పడుతుందేమో చూడాలి.
ఇక, ఎన్టీఆర్ బయోపిక్, వెంకీ సినిమాల నుంచి తప్పుకొన్న తేజ.. రానా దగ్గుపాటితో మరో సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకొంటున్నట్టు తెలుస్తోంది. నాగార్జునతో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడట. మరీ.. ఈ రెండింటిలో తేజ ఏది వర్కవుట్ చేస్తారన్నది చూడాలి.