ఇదీ.. పవన్ మార్క్.. !

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమకు జనాలు ఫిదా అయిపోతున్నారు. ‘పోరాటయాత్ర’ పేరుతో పవన్ పొలిటికల్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పవన్ పోరాటయాత్ర కొనసాగుతోంది. ఐతే, ఈ యాత్ర ప్రారంభానికి ముందు పవన్ పై ఆయన ప్రత్యర్థులు చాలానే సటైర్స్ వేశారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ యాత్రలో ముద్దులు హైలైట్ అయ్యాయి. ఇప్పుడు పవన్ ప్రజలకు హగ్’లు ఇస్తాడేమో అంటూ కామెంట్స్ వినిపించాయ్.

ఇప్పుడు ‘పోరాటయాత్ర’లో పవన్ మార్క్ వినయం, విధేయతని చూసి ప్రత్యర్థులు సైతం ఫిదా అయిపోతున్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో పవన్ ప్రవర్థించిన తీరుని మెచ్చుకొంటున్నారు. సామాన్యుడుకి పవన్ ఇచ్చే రెస్పెక్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పవన్ ఓ రైతుకు అయిన గాయాన్ని ఆయన కాలు పట్టుకొని పరిశీలిస్తున్న ఫోటో, వికాలాంగుడి దగ్గరకు వెళ్లి, వంగి ఆయనతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదీ.. పవన్ మార్క్ అని చాటుతున్నాయి.