కేసీఆర్ లేకుండానే ధర్డ్ ఫ్రెంట్.. !!
2019 సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఇంకో పది నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలపై పెత్తనం సాగిస్తున్నఎన్డీయే కూటమికి మరోసారి అధికారం దక్కడం ప్రాంతీయ పార్టీలకు ఏమాత్రం ఇష్టం లేదు. అదే సమయంలో భాజాపా, కాంగ్రెస్’లకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే ధైర్యం ఏ నాయకుడు చేయలేదు. ఆ ధైర్యం చేసిన తొలి నేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. థర్డ్ ఫ్రెంట్ కోసం కేసీఆర్ ఇప్పటికే ప్రయత్నాలు షురు చేశారు.
ఐతే, ఇప్పుడు కేసీఆర్ లేకుండానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయ్యేలా కనబడుతోంది. కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమం చూస్తే ఇదే అనిపిస్తోంది. ఈ కార్యకంలో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల ఐక్యత కనిపించింది. ఇది థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు పునాది అని చెబుతున్నారు. భాజాపాతో పాటుగా, కాంగ్రెస్ లేకుండానే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఆకాంక్ష.
ఇప్పుడు కేసీఆర్ ఆకాంక్షకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయ్యేలా కనబడుతోంది. కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం సాధ్యకాదనే కామెంట్స్ వినబడుతున్నాయి. థర్డ్ ఫ్రంట్’లో కాంగ్రెస్ ఉంటే దానికి కేసీఆర్ దూరంగా ఉండే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే.. కేసీఆర్ కథతో థర్డ్ ఫ్రంట్ సినిమా తెరకెక్కినట్టవుతోంది. మరీ.. దీనిపై కేసీఆర్ కాపీ రైట్ పిటిషన్ వేస్తారేమో చూడాలి.