కార్లు తగలబడేలా మండుతున్నాయ్.. !

భానుడు భ‌గ‌భ‌గ మండిపోతున్నాడు. అగ్ని గోళాన్ని త‌ల‌పిస్తున్న సూరీడు త‌న ప్ర‌తాపం చూపుతున్నాడు. గ‌త కొద్దిరోజులుగా ఎండ‌లు మ‌రీ ఎక్కువ‌య్యాయి. రోహిణి కార్తెలో రోళ్లు ప‌గిలేలా ఎండ‌లుంటాయ‌ని విన్నాం కానీ కార్లు త‌గ‌ల‌బ‌డేలా కూడా ఎండ‌లు ఉంటాయ‌ని ఇప్పుడే చూస్తున్నాం. అన్న‌ట్టూ ఈ సంఘ‌ట‌న జ‌రిగింది ఎక్క‌డో కాదు మ‌న తెలంగాణ‌లోనే.

అధిక ఉష్ణోగ్రతల కారణంగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని బిలాల్ పూర్-మనియర్ పల్లి మార్గమధ్య‌లో జ‌రిగింది ఈ సంఘ‌ట‌న‌. నడుస్తున్న కారులోంచి ఒక్క‌సారిగా పొగలు రావడంతో కార్ డ్రైవర్ అప్రమత్తం అయ్యాడు. కారులో ఉన్న న‌లుగురూ భ‌యంతో కింద‌కు దిగిపోయారు. కానీ కారు మాత్రం చూస్తుండ‌గానే పూర్తిగా క‌లిపోయింది.. నిజంగా ఎండ‌లు ఎంత మండిపోతున్నాయో క‌దా..