ఇక పురుషుల ర‌క్ష‌ణ‌కు పురుష క‌మిష‌న్.!?

మ‌హిళల‌పై వేధింపుల‌కు, వారి ర‌క్ష‌ణ‌కు ఎలాగైతే క‌మిష‌న్ లు ఉన్నాయో , అలాగే పురుషుల ర‌క్ష‌ణ‌కు ఒక క‌మిష‌న్ ఉండాల‌ని ఏపీ రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి అన్నారు. ఉత్త‌రాంధ్ర‌లో భ‌ర్త‌ను చంపిన సంఘ‌ట‌న విస్తుపోయేలా ఉన్నాయ‌ని, శ్రీ‌కాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్య‌క్తికి అండ‌గా ఉంటామ‌ని ఆమె చెప్పారు.

మ‌హిళ‌ల బాధిత కుటుంబాల‌ను కూడా ప‌రామ‌ర్శిస్తాన‌ని ఆమె అన్నారు. టీవీ సీరియ‌ల్ ప్ర‌భావం వ‌ల్లే మ‌హిళ‌ల్లో నేర ప్ర‌వృత్తి పెరుగుతోంద‌ని, సీరియ‌ల్స్ పై సెన్సార్ పెట్టాల్సినవ‌స‌రం ఉంద‌ని న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌హిళ‌ల నుంచి పురుషుల‌కు ర‌క్ష‌ణ కోసం పురుష క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని ఆమె అన్నారు.