ప్రణబ్ జీ.. గిదేం బాగలేదు…!
కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం ప్రణబ్ వ్యవహారశైలిపై రకరకాలుగా చర్చించుకుంటున్న నేపథ్యంలో వీహెచ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ లో అనేక పదవులు అనుభవించిన ప్రణబ్ ముఖర్జీ ఆర్ ఎస్ ఎస్ సభకు పోవాలని తీసుకున్న నిర్ణయంతో దిగ్భ్రాంతికి గురి అయ్యామని వీహెచ్ అన్నారు.
కేవలం దేశంలో హిందుత్వం మాత్రమే ఉండాలి అనే సంస్థ సభకు ముఖ్య అతిథిగా నాగపూర్ వెళ్లాలని ఆయన ఎందుకు నిర్ణయం తీసుకున్నారోనంటూ దేశ ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారన్నారు. అన్నీ తెలిసి ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు. ప్రణబ్ ఈ అంశంలో మరోసారి పునరాలోచించుకోవాలని సూచించారు వీహెచ్.