గాంధీ వైద్యుల ఆందోళన.. ప్రభుత్వం దొగొచ్చింది !

ప్రొఫెసర్ల పదవీ విరమణ వయోపరిమితి పెంపు నిర్ణయం గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్స్-అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మధ్య చిచ్చుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయోపరిమితిని 58యేళ్ల నుంచి 65యేళ్లకు పెంచుతూ కేసీఆర్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై అసిస్టెంటు ప్రొఫెసర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనగా ఆందోళనకి దిగారు. వీరి ఆందోళన రెండో రోజుకి చేరుకొంది.

తాజాగా, గాందీ ఆసుపత్రి వైద్యులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు రెడీ అయ్యింది. మరికొద్దిసేపటిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆసుపత్రి వైద్యులతో సమావేశం కానున్నారు. అసిస్టెంట్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్ల డిమాండ్లు అయిన ప్రొఫెసర్ల పదవీ విరమణ వయోపరిమితి పెంపు నిర్ణయం రద్దు, పెండింగ్‌ సమస్యల పరిష్కారంపై మంత్రి చర్చించే అవకాశం ఉంది.