ప్ర‌ణ‌బ్ కాబోయే ప్ర‌ధాని.. !?

జూన్7న నాగ్ పూర్ లో జ‌రిగే ఆర్ఎస్ఎస్ కార్యాల‌యంలో కార్య‌క్ర‌మానికి అతిధిగా హాజ‌ర‌వ‌నున్నారు మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్. సుదీర్ఘ‌కాలంగా కాంగ్రెస్ నేత‌గా ఉంటూ రాష్ట్రప‌తి స్థాయికి చేరిన ఆయ‌న ఇప్పుడు బీజేపీ సంబంధిత ఆర్ఎస్ఎస్ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానుండ‌టంపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. రాష్ట్రపతి భవన్‌ను నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఆయ‌న కాంగ్రెస్‌తో సన్నిహితంగానే ఉంటున్నారు. రాహుల్ గాంధీకి రాజ్ గురు పాత్ర వహిస్తున్నారన్న ప్రచారం కూడా జ‌రుగుతోంది.

ఈనేప‌థ్యంలో ప్ర‌ణ‌బ్ ఆర్ఎస్ఎస్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతుండ‌టంపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవనం పోసేందుకు ప్రణబ్ పథకం ప్ర‌కారం వ్య‌వ‌హ‌రిస్తున్నారనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. అలా జ‌రిగితే మాజీ రాష్ట్రపతి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం దేశ చరిత్రలో దాదాపు ప్రప్రథమం అవుతుంది. ఆర్ఎస్ఎస్ స‌భ‌లో ఆయ‌న చేసే ప్ర‌సంగాన్ని బ‌ట్టి ఆయ‌న ఎవ‌రివైపు ఉన్నార‌నేది స్ప‌ష్ట‌త రానుంది.

ఆర్ఎస్ఎస్ ఆహ్వానం ఆంద‌గానే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం బీజేపికి మేలు చేసేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీయేత‌ర కూట‌మికి ఆయ‌న నాయ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని మ‌రికొంద‌రు విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల దృష్టి అంతా ప్ర‌ణ‌బ్ వైపే ఉంది. ఆయ‌న ఏం చేయబొతున్నారు, ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇవ్వ‌బోతున్నార‌నేది ఇప్పుడు జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఒక ర‌కంగా కాంగ్రెస్ , బీజేపీ ల భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌కు ఆయ‌న కీరోల్ గా మారిపోయార‌ని చెప్పుకోవ‌చ్చు. అలాంటి వ్య‌క్తి ఆర్ఎస్ఎస్ కార్య‌క్ర‌మంలో చేసే ప్ర‌సంగం ఆధారంగా ఆయ‌న ఎవ‌రిపై గురి పెట్టారు అనేది స్ప‌ష్టం కాబోతుంది.. చూడాలి మ‌రి ప్ర‌ణ‌బ్ దాదా ఏం చేస్తారో..