మామతో సమంత ఫైట్ చేస్తోంది

మామ-కోడళ్ల కొట్లాట మొదలైంది. మామ నాగార్జునతో అప్పుడే ఫైట్ స్టార్ట్ చేసింది సామ్. నాగ్ ‘ఆఫీసర్’గా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చేశాడు. ‘ఆఫీసర్’కు పోటీగా రాజు తరుణ్ ‘రాజుగాడు’, విశాల్ ‘అభిమన్యుడు’ బాక్సాఫీస్ యుద్ధానికి దిగాయి. విశాల్-సమంత జంటగా నటించిన ‘అభిమన్యుడు’ తమిళ్ వర్షన్ సూపర్ హిట్టయ్యింది. విశాల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

తెలుగులో విశాల్ కంటే సమంతకే క్రేజ్ ఎక్కువ. ఇక్కడ ఆమె స్టార్ హీరోయిన్. దీంతో ‘అభిమన్యుడు’ సమంత సినిమాగానే పబ్లిసిటీ జరిగింది. ఇదీగాక, రంగస్థలం, మహానటి సినిమాలతో సమంత ఫుల్ స్వింగులో ఉంది. ఈ నేపథ్యంలో ఈ వారం బాక్సాఫీస్ దగ్గర ప్రధాన పోటీ ఆఫీసర్, అభిమన్యుడు సినిమాల మధ్యనే ఉండనుంది. ఈ సీన్ ని నాగ్-సమంతల ఫైట్ గా చెప్పుకొంటున్నారు. మరీ.. మామ-కోడళ్ల ఫైట్ లో ఎవరు హిట్ అవుతారు ? ఎవరు ఫట్ అవుతారనేది తేలనుంది.