నొచ్చుకున్న కుంతియా..!!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జిగా గులాం న‌బీ ఆజాద్ వ‌స్తారంటూ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంపై ప్ర‌స్తుతం ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కుంతియాకు కాస్త ఇబ్బంది క‌లిగిస్తున్నాయ‌ట‌. సొంత పార్టీ నేత‌లూ ఈ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసేవారితో భాగ‌స్వాముల‌వ‌డం ఆయ‌న్ను కొంత బాధించిద‌ట‌.

గాంధీభ‌వ‌న్ లో జ‌రిగిన పార్టీ కో ఆర్డినేష‌న్ క‌మిటీ మీటింగ్ లో ఆయ‌న పార్టీనేత‌ల వ్య‌వ‌హారంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తాను ఇంచార్జిగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో గులాం న‌బీ ఆజాద్ కు స్వాగ‌తం అంటూ పోస్టింగులు చేయ‌డంపై ఆయ‌న అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అధిష్టానం నుంచి ఎలాంటిప్ర‌క‌ట‌న రాక‌ముందే ఇలా చేయ‌డం త‌న‌ను అవ‌మానించిన‌ట్టే అంటూ పార్టీ నాయ‌కుల ముందు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇంచార్జిగా తానే ఉండాల‌ని త‌న‌కు కోరికేమీ లేద‌ని, అధిష్టానం ప్ర‌క‌టించిన త‌రువాత ఏమైనా చేసుకోండ‌ని చెప్పార‌ట కుంతియా. ఈ విష‌యం తెలిసినవారంతా పాపం కుంతియా అనుకుంటున్నార‌ట‌.