కుక్క కిడ్నాప్ అయింద‌ట‌..!!

చిన్నారుల‌ను కిడ్నాప్ చేస్తార‌ని కేసులు పెట్ట‌డం చూశాం, బంగారు న‌గ‌లు, డ‌బ్బులు ఎత్తుకెళ్లార‌ని కేసులు పెడ‌తార‌ని విన్నాం. పెంపుడు కుక్క‌ను ఎత్తుకెళ్లార‌ని కేసులు పెట్ట‌డం ఎక్క‌డైనా విన్నారా.. హైద‌రాబాద్ బ‌ల్కంపేట‌లో ఓ ఇంట్లో నుంచి లాబ్ర‌డార్ జాతి కుక్క‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ఎత్తుకుపోయార‌ట‌.

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న లాబ్ర‌డార్ జాతి కుక్క ట్విస్ట‌ర్ అప‌హ‌ర‌ణ‌కు గురైందంటూ దాని య‌జ‌మాని ఎస్సార్ న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశార‌ట‌. ఎంత‌విలువైన‌దైనా, ఏ జాతికి చెందిన‌దైనా కుక్క‌పోయిందంటూ ఫిర్యాదు చేయ‌డ‌మేంటో అనుకుంటున్నారు తెలిసిన వారంతా. ఇదిగో ఇదే ఆ ట్విస్ట‌ర్ అనే కుక్క‌..