4యేళ్ల తెలంగాణ.. దేశంలోనే అగ్రస్థానం.. !

భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటి (జూన్ 2)తో 4యేళ్లు పూర్తి చేసుకొంది. 5లోకి అడుగుపెట్టనుంది. పట్నం, పల్లె పల్లెన తెలంగాణ రాష్ట్ర నాలుగో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌ పెరేడ్‌ మైదానంలో జరగనున్న వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. తెలంగాణ ప్రజల కోసం మరిన్ని వరాలు కురిపించబోతున్నారు.

నాలుగేళ్ల తెలంగాణ రాష్ట్రం దేశంలోని అగ్రస్థానంలో నిలిచింది. 36 నెలల్లో 365 సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. 4యేళ్ల తెలంగాణ దేశంలోని మిగితా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. సంక్షేమంలో స్వర్ణయుగం. ప్రపంచం మెచ్చిన పారిశ్రామక విధానం మన సొంతం. ఇప్పుడు తెలంగాణ అభివృద్దిలో నెం.1. బంగారు తెలంగాణ బాటలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుకొంటూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తోంది.. మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.