ఆగ‌మాగ‌మైన ఏపీ సీఎం స‌భ‌..!!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శృంగవరపు కోటలో ప్రత్యేక సభ నిర్వహించారు.  ఈ సభలో సిఎం చంద్ర‌బాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాతుండ‌గా అనుకోని ప‌రిణామం జ‌రిగింది. సభ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలి వాన ప్రారంభ‌మైంది. సభా ప్రాంగణం దగ్గర వర్షం ధాటికి టెంట్లు కూలాయి. ప్రమాదకర స్థాయిలో ఈదురు గాలులు, భారీ వర్షం కురుస్తుండ‌టంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్ర‌త్యేక బ‌ల‌గాలు సీఎంకు రక్షణ వలయంగా నిలిచాయి.
 
సోమవారం ఉదయం లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను బాబు అడిగి తెలుసుకున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రులను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని, వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని చంద్రబాబు చెప్పారు.అనంత‌రం శృంగ‌వ‌ర‌పు కోట‌లో స‌భ జ‌రుగుతుండ‌గా ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం మారిపోవ‌డంతో స‌భా ప్రాంగ‌ణంలో కొంత గంద‌ర‌గోళ పరిస్థితి నెల‌కొంది.