అందుకే బ‌స్సు యాత్ర‌కు విరామం: ఉత్త‌మ్

ప్ర‌జాచైత‌న్య బ‌స్సు యాత్ర పేరుతో కాంగ్రెస్ తెలంగాణ వ్యాప్తంగా ద‌శ‌ల‌వారీగా తిరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఓ మొద‌టిద‌శ‌లో కొన్ని ప్రాంతాలు , రెండో ద‌శ‌లో మ‌రికొన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన కాంగ్రెస్ ప్ర‌స్తుతం బ‌స్సు యాత్ర‌కు కాస్త విరామం ప్ర‌క‌టించింది. ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి ఏపార్టీలోకి వెళ్ల‌డం లేద‌ని, ఆయ‌న కాంగ్రెస్ పార్టీలోనే ఉంటార‌ని పీసీసీ చీఫ్ ఉత్తమ్ స్ప‌ష్టం చేశారు. ఆయ‌న‌తో తాను ప‌ర్స‌న‌ల్ గా మాట్లాడాన‌ని కూడా చెప్పారు.

బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల‌కు ముస్లింలు ఓటు వేయ‌వ‌ద్ద‌ని పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ పిలుపునిచ్చారు. ముస్లింలు సుర‌క్షితంగా ఉండాలంటే అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల‌కు హాజ‌ర‌వ్వాల‌నే బ‌స్సు యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించామ‌ని చెప్పారు ఉత్త‌మ్. ఇఫ్తార్ వేద‌క‌గా ముస్లిం సోద‌రుల‌కు కాంగ్రెస్ కు ఓటువేయాల‌ని విజ్ఞ‌ప్తి చేయాల‌ని కోర‌తామ‌ని అన్నారాయ‌న‌.