వివేక్ కు హైకోర్టు షాక్..!!
టీఆర్ఎస్ నేత , వివేక్ కు కోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విషయంలో చాలాకాలంగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజాగా కోర్టు నిర్ణయం వెలువరించింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి విషయంపై కోర్టు స్పష్టతనిచ్చింది.
వివేక్ ను ప్రెసిడెంట్ ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ను నిలిపివేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. మరో సారి పూర్తి విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చింది. గతంలో ఒంబుడ్స్ మన్ ఇచ్చిన తీర్పు సమర్ధించింది. విచారణ పూర్తయ్యే వరకు ప్రెసిడెంట్ పదవిలో కొనసాగవద్దని డివిజన్ బెంచ్ తీర్పునిచ్చింది.