జగన్ మూర్ఖుడు.. బీజేపీ నేతలను రాళ్లతో కొట్టాలి.. !!
వైసీపీ అధినేత జగన్ , బీజేపీ నాయకులపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరంపై బీజేపీ, వైసీపీ నేతల వ్యాఖ్యలపై ఆయన ఓ రేంజ్ లో స్పందించారు. రెండు పార్టీలపై విమర్శలు గుప్పించారు. జగన్ ది హత్యారాజకీయ వారసత్వమని అన్నారు.జగన్ అక్రమాస్తులను నిరూపించడానికి సిద్ధమంటూ సవాల్ విసిరారు. మైనింగ్ మాఫియాను అడ్డుకుంటారని పరిటాలను హత్యచేయించారని ఆయన విమర్శించారు. జగన్ మూర్ఖుడని ఒకసారి పోలవరం ప్రాజెక్టును చూసిరావాలని హితవు పలికారు.
అత్యాధునిక పరిజ్ఞానంతో పోలవరం నిర్మాణం జరుగుతుంటే ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీ మానసపుత్రుడిగా జగన్ మారాడని, బీజేపీ నాయకులను రాళ్లతో కొట్టాలని ఆయన ఘాటుగా విమర్శించారు.