సమ్మె దిశగా తెలంగాణ రేషన్ డీలర్లు..!!
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లు సమ్మెకు సిద్ధమవుతున్నారు. జూలై నెల రేసన్ కు డీడీలను కట్టేది లేదని డీలర్లు ప్రకటించారు. బయోమెట్రిక్ విధానంతో తాము నష్టపోతున్నామని, ప్రతీ నెల ఐదు నుంచి పదిహేనువేల రూపాయలు నష్టం వస్తోందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జూనియర్ అసిస్టెంట్ స్కేల్ తమకూ అమలు చేయాలని వారంటున్నారు. లేకపోతే జూలై ఒకటి నుంచి రేషన్ షాపులు పూర్తిగా మూతపెడతామని హెచ్చరిస్తున్నారు డీలర్లు.