అరవింద సమేత.. రిలీజ్ డేట్ ఫిక్స్

త్రివిక్రమ్ మాట, తారక్ ఆట కలిస్తే.. అద్భుతమే. ఇప్పుడీ అద్భుతాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి ముహూర్తం కూడా ఫిక్సయినట్టు సమాచారమ్. ‘అరవింద సమేత’ని దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే తారక్ – త్రివిక్రమ్ ఫిక్సయ్యారు. ఇప్పుడు రిలీజ్ డేటుని కూడా ఫిక్స్ చేసినట్టు చెబుతున్నారు. ఆగస్టు 10న సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ఆగస్టు 8 నుంచే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో అరవింద సమేత కు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ అదిరిపోయే రేంజ్ లో రావడం ఖాయమని చెబుతున్నారు.

యాక్షన్, ఫ్యాక్షన్ ఎన్టీఆర్’కు కొట్టిన పిండి. ఇప్పుడు త్రివిక్రమ్ కూడా తారక్ కి ఇష్టమైన ఫ్యాక్షన్ నే ఎంచుకొన్నాడు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో సినిమాని తెరకెక్కిస్తున్నారు. తారక్ ని ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా చూపించబోతున్నాడు. దీనికితోడు త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయన్నది ఈ దసరాకు తెలియనుంది.