‘ముందస్తు’ ముంచుకొస్తుంది.. !

దేశంలో ముందస్తు ఎన్నికల ముంచుకొస్తున్నాయని ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో మధ్యప్రదేష్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఐతే, ప్రభుత్వ వ్యతిరేక అధికంగా ఉండటంతో మూడు రాష్ట్రాల్లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడం దాదాపు అసాధ్యమని చెబుతున్నారు. ఆ విషయం భాజాపా అధిష్టానానికి అర్థమైంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు వెళదామనే ఆలోచనలో మోడీ, షాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారమ్.

ఇప్పటికే మోడీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత మొదలైంది. దీనికితోడు మిత్ర పక్షాలు ఒక్కొక్కటిగా దూరం జరుగుతున్నాయి. ఇప్పటికే శివసేన, టీడీపీ ఎన్ డీయే నుంచి దూరం జరిగాయి. బెంగాల్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా భాజాపాతో దోస్తానా మళ్లీ కట్ చేసేకొనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయ్. ఈ నేపథ్యంలో మధ్యప్రదేష్, రాజస్థాన్, ఛతీస్ ఘడ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సాధారణ ఎన్నికలకు వెఌతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని భాజాపా పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే ముందస్తు రాగం అందుకొన్నట్టు తెలుస్తోంది.

అదే జరిగితే ఈ యేడాది చివర్లో ఎన్నికలు రావొచ్చు. ఇప్పటికే ముందస్తుపై భాజాపా తన సన్నిహిత పార్టీలకు సంకేతాలు కూడా ఇచ్చందని చెప్పుకొంటున్నారు. ఇదికాస్త లీక్ కావడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యూహాలు మారుస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ చెప్పుకొంటున్నారు. మరీ.. మోడీ, షాల ముందస్తుకు వెళతారా.. ? వెఌతే వారి ముందస్తు ఆలోచన ఫలితాన్ని ఇస్తుందా.. ?? అన్నది చూడాలి.