సూపర్ ఛాన్స్ కోసం సీనియర్ హీరోయిన్స్ ఫైట్

సూపర్ స్టార్ రజనీ కాంత్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేయడం అంటే మాటలా. ఇప్పుడా ఛాన్స్ కోసం ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ మధ్య పోటీ ఏర్పడినట్టు కోలీవుడ్ సమాచారమ్. ఇటీవలే రజనీ ‘కాలా’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఫస్ట్ షోతోనే మిక్సిడ్ టాక్ ని సొంతం చేసుకొంది. కలెక్షన్స్ కూడా రజనీ సినిమా రేంజ్ లో లేవు. రజనీ నటించిన మరో సినిమా రోబో ‘2.ఓ’ ఎప్పుడు వస్తుందో అర్థకావడం లేదు. ఈలోగా రజనీ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో రజనీకి విలన్ గా విజయ్ సేతుపతి నటించనున్నారు.

రజనీ సరసన హీరోయిన్ గా త్రిష పేరు వినిపించింది. ఆమెని విజయ్ సేతుపతి రికమెండ్ చేసినట్టు వార్తలొచ్చాయ్. ఐతే, త్రిష పేరు ఇంకా ఫైనల్ కాలేదు. ఈలోగా కాజల్ పేరు తెరపైకి వచ్చింది. రజనీ సరసన కాజల్ అయితే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ సూపర్ స్టార్ సినిమా ఛాన్స్ ఎవరికీ దక్కుతుందా ? అనే ఉత్కంఠ కోలీవుడ్ లో నెలకొంది.

ఇప్పటి వరకు త్రిష, కాజల్ కు సూపర్ స్టార్ సినిమా ఛాన్స్ రాలేదు. రజనీ సరసన నటించాలనే కోరికని త్రిష ఎప్పటి నుంచే వెలుబుచ్చుతుంది. కాజల్ ఆ పని చేయకున్న.. ఆమె రజనీ సినిమా ఆఫర్ కోసం వేయి కళ్లతో ఏర్పడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్ స్టార్ సినిమా ఛాన్స్ కోసం ఈ ఇద్దరు హీరోయిన్స్ పోటీ పడుతున్నారు. మరీ… ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.