4శాతం రిజ్వ‌ర్వేష‌న్ అమ‌లు చేయాలి..!

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో కాచిగూడ -క‌రీంన‌గ‌ర్‌ ల మ‌ధ్య న‌డిచే పాసింజ‌ర్ రైలును కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్ జెండా ఊపి రిమోట్ ద్వారా రైలు స‌ర్వీసును ప్రారంభించారు. రైల్వే ఉద్యోగాల్లో ప్ర‌స్తుతమున్న 3 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను డిసెబిలిటీ రిజ‌ర్వేష‌న్‌ బిల్లు ద్వారా పార్ల‌మెంట్ 4 శాతంకు పెంచింద‌ని తెలిపారు. ఇక ముందు జ‌రిపే రైల్వే నియామ‌కాల్లో విక‌లాంగుల‌కు పెంచిన‌ రిజ‌ర్వేష‌న్‌ను వ‌ర్తింప‌చేయాల‌ని క‌విత కోరారు.

నిజామాబాద్ రైల్వే స్టేషన్ A గ్రేడ్ పొందినా ఆ మేరకు సదుపాయాల కల్పన జరగలేదని, వ‌స‌తులు కల్పించాలని అధికారులను అదేశించాల‌ని ఆమె కోరారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు ప్లాటినం రేటింగ్ సర్టీఫికేషన్ అవార్డు పొందడం అభినందనీయమ‌న్నారు. తెలంగాణ లో రైల్వే లైన్ల విస్తరణ కోసం రైల్వే ప్రాజెక్టు ల సత్వర పూర్తికి తెలంగాణ ప్రభుత్వం, రైల్వే శాఖ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయని ఆశిస్తున్న‌ట్లు క‌విత చెప్పారు. కాచిగూడ-నిజామాబాద్ పాసింజర్ రైలును కరీంనగర్ వరకు పొడిగించిన రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కు ఎంపి క‌విత‌ కృతజ్ఞతలు తెలిపారు.ఈ రైలు వ‌ల్ల నిజామాబాద్ నుండి కరీంనగర్ వరకు గ్రామీణ ప్రాంత వాసులకు రైలు ప్రయాణ సౌకర్యం ఏర్పడిందన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి సికింద్రాబాద్ కు రైలు కనెక్టివిటీ కల్పించాలని ఎంపి క‌విత ర్వైల్వే మంత్రి పీయూష్ గోయ‌ల్‌ను కోరారు.