నాని ‘జెర్సీ’ నెం. 36

నేచురల్ స్టార్ నాని క్రికెట్ గ్రౌండ్ లోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘జెర్సీ’ కుట్టించుకొన్నాడు. జెర్సీ నెం. 36తో బరిలోకి దిగనున్నాడు. ఫోర్లు, సిక్సులతో హోరెత్తించనున్నాడు. ఇవన్నీ నాని కొత్త చిత్రం విశేషాలు. ‘మళ్లీ రావా’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి నాని ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా టైటిల్ ని ‘జెర్సీ’గా ఫిక్స్ చేశారు. ‘జెర్సీ’ నెం. 36, బ్యాట్, బ్యాడ్ లు ఉన్న పోస్టర్ ని నాని తన ట్విట్టర్ ఖాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం నాని శ్రీరామ్ ఆదిత్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కింగ్ నాగ్ తో కలిసి తెరను పంచుకోనున్నాడు. ఇప్పుడీ సినిమా జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత ‘జెర్సీ’ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. ఇక, ఓ వైపు సినిమాలు చేస్తూనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కోసం హోస్ట్ గా వ్యవహారిస్తున్నాడు నాని. సినిమాలు, బిగ్ బాస్ షో ద్వారా రెండు చేతుల సంపాదిస్తున్నాడు.