ఎల్లో మీడియాలో ఎన్ టీవీ చేరిక.. !

సాధారణ ఎన్నికలకు పది నెలల ముందే ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే ప్రధాన పోటీగా భావిస్తున్న టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచారానికి దిగాయి. దీంతో మీడియా మరింత ప్రాధాన్యత పెరిగింది. ఎన్నికల వేళ అందినంత దండుకోవడానికి టీవీ ఛానెల్స్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా రెడీగా ఉన్నాయి. ఇప్పటికే పార్టీలు, ప్రజాప్రతినిధులతో బేరాసారాలని తెరలేపినట్టు వార్తలొస్తున్నాయి. మరోవైపు, ఎన్నికల వేళ మీడియా మద్దతుని మరింతగా పెంచుకొనేందుకు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారమ్.

ఇప్పటికే టీడీపీకి వంతన పాడే టీవీ ఛానల్స్ చాలానే ఉన్నాయి. పొలిటికల్ సర్కిస్ లో వీటిని ఎల్లో మీడియాగా పిలుస్తుంటారు. ఆంధ్రజ్యోతి, మహాన్యూస్.. తదితర టీవీ ఛానెల్స్ ని టీడీపీ ఆస్థాన ఛానెల్స్ గా పిలుస్తుంటారు. ఇప్పుడీ ఎల్లో మీడియా లిస్టులో ఎన్ టీవీ కూడా చేరిపోయినట్టు చెబుతున్నారు. ఇటీవలే ఎన్ టీవీ ఛానల్ చైర్మన్ నరేంద్ర చౌదరి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. దాదాపు 90ని॥ల పాటు వీరి మధ్య చర్చ జరిగింది. దీంతో వచ్చే ఎన్నికలకు డీల్ కుదిరిందని చెప్పుకొంటున్నారు.

ఇన్నాళ్లు ఎన్ టీవీ గోడ మీద పిల్లిలా ఉంది. వైసీపీ కాస్త సపోర్టింగా అనిపించినా.. పూర్తిగా అటు ఒరిగిపోలేదు. ఎన్నికల వేళ ఎన్ టీవీ వైసీపీని వైపు పూర్తిగా మొగ్గితే జరిగే డ్యామేజ్ ని ముందే ఊహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ టీవీ చైర్మన్ ని పిలిచి ముందే డీల్ కుదుర్చుకొన్నట్టు సమాచారమ్. ఎన్ టీవీ చేరికతో ఇప్పుడు ఎల్లో మీడియా బలం మరింత పెరిగిందని చెప్పవచ్చు.