రానా ముఖ్యమంత్రి అవుతారంట.. !
టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుపాటి ఏపీ ముఖ్యమంత్రి అవుతారంట. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానంలోకి వస్తాడంట. ఇప్పుడీ న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే తెరపై రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు రానా. ‘లీడర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాల్లో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. ఈ రెండు సినిమాలతో కుర్చీలాట బాగానే ఒంటబట్టించుకొన్నాడు. ఆ అనుభవంతోనే చంద్రబాబు స్థానంలోకి రావడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది.
క్రిష్ దర్శకత్వంలో ఎన్ టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్ టీఆర్ గా బాలయ్య, ఆయన భార్య బసవతారం పాత్రలో విద్యాబాలన్ కనిపించనున్నారు. ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్ రావు పాత్రలో బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ నటించనున్నారు. ఇక, చంద్రబాబు పాత్ర కోసం రానా దగ్గుపాటి సరిగ్గా సరిపోతాడని దర్శకుడు క్రిష్ భావిస్తున్నట్టు సమాచారమ్. మరీ.. చంద్రబాబు పాత్రలో రానా ఏ మేరకు మెప్పిస్తాడన్నది చూడాలి.