హ‌స్తిన చేరిన తెలుగు రాజ‌కీయాలు..!

అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, ఇటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రల రాజ‌కీయాలు ఇప్పుడు హ‌స్తిన‌కు చేరాయి. వివిధ పార్టీల కీల‌క భేటీల‌న్నీ ఢిల్లీలోనే జ‌రుగుతున్నాయి. ఈ రెండు మూడు రోజుల‌నుంచి తెలుగు రాజ‌కీయాల‌ను ప‌రిశీలించిన ఎవరికైనా ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం ప్ర‌ధాని మోదీని క‌లిసేందుకు వెళ్ల‌డం, టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కు అధిష్టానం నుంచి పిలుపు రావ‌డం, గురువారం వైసీపీ , బీజేపీ పార్టీల మ‌ధ్య జ‌రిగిన ప‌రిణామాలు ఇలా తెలుగు రాజ‌కీయపార్టీల కీల‌క భేటీల‌న్నీ ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతుండ‌టంతో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఏపీ రాజ‌కీయాల‌కు సంబంధించి వైసీపీ, బీజేపీ నేత‌లు ఢిల్లీలో ప్ర‌త్యేకంగా భేటీ అవ‌టం ఏపీ రాజ‌కీయాల్లో హాట్ చ‌ర్చ‌ల‌కు దారితీసింది. ఇప్ప‌టికే అధికార టీడీపీ వైసీపీ, బీజేపీలు చీక‌టి ఒప్పందం చేసుకున్నాయంటూ ఆరోపిస్తుండ‌టం, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు అందుకు బ‌లాన్ని చేకూరేలా ఉన్నాయ‌నే చ‌ర్చ మొద‌లైంది. హ‌స్తిన వేదిక‌గా తాము ఎలాంటి భేటీ కాలేద‌ని ఆయా పార్టీల నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ ఏపీ రాజ‌కీయాల‌ను ఢిల్లీ ప‌రిణామాలు కీల‌కంగా మారుతున్నాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధానిని క‌లిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన జోనల్‌ వ్యవస్థలకు అనుగు చర్చించనున్నారు. కొత్త జోనల్‌ వ్యవస్థ, మైనార్టీ, గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడనున్నారు. రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన జోనల్‌ వ్యవస్థలకు అనుగుణంగా… రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫార్సు చేయాలని ప్రధానిని కోరనున్నారు. దానితో పాటుగా 9,10వ షెడ్యూల్‌లోని సంస్థల విభజన సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు నీతిఆయోగ్ ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది.

మ‌రోవైపు టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలతో పాటు రానున్న స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహం, టీపీసీసీ కో-ఆర్డినేషన్, పార్టీ ప్రచార కమిటీ పదవుల భర్తీ విషయంలో అధిష్టానంతో చర్చించేందుకు రాహుల్ తో భేటీ అవుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవి కోసం, టీపీసీసీలో పలు కార్యవర్గ పదవులు భర్తీ చేయడం లేదని నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ నేపధ్యంలో ఉత్తమ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యత సంతరించుకొంది.