రేవంత్ కోసం ఉత్తమ్ పైరవీలు
కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్తలో రేవంత్ రెడ్డి జోరు చూపించాడు. తెలంగాణలో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చి తీరుతా. కేసీఆర్ గద్దె దించుతా. అదే నా లక్ష్యం అన్నట్టుగా వ్యవహరించాడు. ప్రెస్ మీట్ ల మీద ప్రెస్ మీటులు పెట్టి కేసీఆర్ ని కడిగే ప్రయత్నం చేశాడు. తద్వారా కాంగ్రెస్ లో కేసీఆర్ కు సరైన మొగుడు తాననేనని నిరూపించుకొనే ప్రయత్నం చేశాడు. ఐతే, రేవంత్ యాక్షన్ కి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. పార్టీలో కీలక పదవి ఇస్తారని భావించానా.. అది జరగలేదు. దీంతో బస్సు యాత్ర తర్వాత రేవంత్ కాస్త తగ్గారు. త్వరలో ఆయన మళ్లీ టీడీపీలో చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డికి పార్టీలో కీలక పదవి ఇప్పించేందుకు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైరవీలు మొదలెట్టినట్టు సమాచారమ్. ప్రస్తుతం ఉత్తమ్ ఢిల్లీలో నే ఉన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాతోపాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని కలుసుకున్నారు. టీకాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు పదవి కోసం రేవంత్ రెడ్డి పేరుని ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే దామోదర్ రెడ్డి పార్టీ వీడారు. ఒకవేళ రేవంత్ రెడ్డికి కీలక పదవి ఇస్తే డీకే అరుణ్ వర్గానికి చెందిన నేతలు పార్టీ వీడుతామని హెచ్చరిస్తున్నారు. ఫైనల్ గా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చింది రేవంత్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టడంపై నిర్ణయం తీసుకోనున్నాడు ఉత్తమ్. రేవంత్ రెడ్డి కీలక పదవి ఇస్తే.. అది ఉత్తమ్ ఎసరు తెచ్చుకొన్నట్టు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భవిష్యత్ లో సీఎం క్యాండిటేటుగా పోటీకొస్తాడని భయం.. మరీ.. !