తారక్ ‘రెండో బుడ్డోడి ఫోటో’.. మీ కోసం !

‘మా కుటుంబం మరింత పెద్దది అయ్యింది. మళ్లీ బాబు పుట్టాడు’ అంటూ సంతోషాన్ని అభిమానులతో పంచుకొన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. గురువారం లక్ష్మీ ప్రణతి రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తారక్ చేసిన ట్విట్ ఇది. దీంతో ‘మా బుడ్డోడికి మరో బుడ్డోడు పుట్టాడోచ్’ అంటూ నందమూరి అభిమానులు మురిసిపోయాయి. అదే సమయంలో నందమూరి ఫ్యామిలీ బుల్లి వారసుడి ఫోటో చూసేందుకు ఆసక్తి చూపారు. తారక్ కొడుకు ఫోటో కోసం సోషల్ మీడియాని జల్లడపట్టారు. కానీ, దొరకలేదు. దీంతో కాస్త నిరాశకు గురయ్యారు. ఇప్పుడు బుల్లి బుడ్డోడి ఫోటో బయటికొచ్చింది.

తారక్ చిన్ని కోడుకు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అచ్చు గుద్దినట్టుగా ఎన్టీఆర్‌‌లా.. ఒత్తయిన జుట్టుతో బాబు నిద్రిస్తోన్న ఫొటో అది. బుల్లిబుడ్డోడికి నందమూరి ఫ్యాన్స్ అప్పుడే పేరు కూడా పెట్టేశారు. బుల్లి యంగ్ టైగర్‌కు ‘తారక్ 2.0’ అని ముద్దుగా పిలుచుకొంటున్నారు. మరికొద్దరు తారక్ ‘తారక్ 2.0’ ఫస్ట్ లుక్ అంటూ బుల్లి బుడ్డోడి ఫోటోని పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైతే బుల్లి యంగ్ టైగర్ ఫోటో బయటికొచ్చింది. ఇక, తెలియాల్సింది.. పేరు.

2011లో ఎన్ టీఆర్ – లక్ష్మీ ప్రణతి ల వివాహం జరిగింది. వీరికి 2014లో మొదటి సంతానంగా అభయ్ రామ్ జన్మించాడు. ఇప్పుడు అభయ్ వయసు 4యేళ్లు. ఇప్పటికే తండ్రితో కలిసి అల్లరి చేయడం మొదలెట్టాడు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు అభిమానుల కోసం షేర్ చేస్తుంటాడు తారక్. ఇంకొన్నాళ్లు ఆగితే బుల్లి యంగ్ టైగర్ అన్నయ్య అభయ్, తండ్రి తారక్ చేసే అల్లరి పనుల్లో జాయిన్ కాబోతున్నాడు.. !