‘ప్రభాస్ కోసం భీమవరం అమ్మాయి’ దొరికేసింది !
టాలీవుడ్ పెళ్లికానీ ప్రసాదుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ఆయన పెళ్లి న్యూస్ ఎప్పుడూ హాట్ టాపిక్ నే. భీమవరం అమ్మాయితో ప్రభాస్ పెళ్లి చేయాలని.. ఆయన కుటుంబ సభ్యులు భావించారు. ప్రభాస్ చేసుకోబోయే భీమవరం అమ్మాయి ఈమె అంటూ ఒకరిద్దరి అమ్మాయిల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి కూడా. ఇంతలోనే స్వీటీ అనుష్కతో ప్రభాస్ ప్రేమలో ఉన్నాడనే న్యూస్ బయటికొచ్చింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో ప్రభాస్ కోసం భీమవరం అమ్మాయి అనే టాపిక్ కి పులిస్టాప్ పడింది. స్వీటీతో ప్రేమ, పెళ్లి విషయాన్ని ఖండించిన ప్రభాస్ మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ‘సాహో’ సినిమా చేస్తున్నాడు.
మరోవైపు, ప్రభాస్ పెళ్లిపై పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఈ మధ్య స్వీటీ అనుష్క ప్రభాస్ ని పెళ్లాడం లేదు. ఆమె కోసం కుటుంబ సభ్యులు వరుడిని వెతికే పనిలో ఉన్నారు. ఓ బిజినెస్ మెన్ తో స్వీటీ పెళ్లి దాదాపు ఫిక్సయినట్టేనని వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి న్యూస్ కూడా ఇండస్ట్రీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ చేసుకోబోయేది భీమవరం అమ్మాయినే. ప్రభాస్ ప్రభాస్ తల్లి శివ కుమారి, పెదనాన్న కృష్ణంరాజు ఓ అమ్మాయిని అనుకొన్నారు. భీమవరంలో విద్యాసంస్థలను నడుపుతోన్న ఓ ప్రముఖ వ్యక్తి కుమార్తెని ప్రభాస్ పెళ్లాడబోతున్నట్టు సమాచారమ్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఈ యేడాదియే ప్రభాస్ పెళ్లి భోజనం పెట్టొచ్చేమో.. !