ఏడు అంశాలను ప్రస్తావించిన సీఎం కేసీఆర్..
నాలుగవ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడు అంశాలను ప్రస్తావించారు.తెలంగాణలో 98 శాతం మంది చిన్న సన్న కారు రైతులు తెలంగాణ లో ఉన్నారని, రైతుబందు పథకం కింద ఎకరానికి 4వేల రూపాయలు రైతులకు అందజేసామని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతు బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో ప్రవేశ పెట్టామని, 18 నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరికీ ఎల్ఐసి బీమా పథకాన్ని ని అందజేస్తున్నామన్నారు.
రైతు మరణిస్తే 5లక్షలు బీమా రైతుకు ఇస్తున్నామని, ఇందుకోసం దాదాపు వెయ్యి కోట్ల ప్రీమియం చెల్లిస్తున్నామని చెప్పారు..50 లక్షలు రూపాయలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు. పట్టా దారు పాస్ పుస్తకాలు 50 లక్షల మందికి అందజేసామని చెప్పారు. నీటి పారుదల రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నామన్నారు. కాళేశ్వరం ,పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త జీవం వస్తుందని చెప్పుకొచ్చారు.
మూడేళ్లలో 1050 కోట్లతో 356 వ్యవసాయ గోదామలు నిర్మించామని, వ్యవసాయ రంగంపై దృష్టిపెట్టి, వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు పన్ను రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. డైరీలు ,కోళ్ల పరిశ్రమ,మత్స పరిశ్రమ, గొర్రెల మేకల పెంపకంలో ఆదాయ పన్న నుంచి మినహాయించాలని కోరారు. భూ రికార్డుల ప్రక్షాళన,రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్ వివరించారు. నీటి ప్రాజెక్టుల అంశాలను సమావేశంలో ప్రస్తావించారు. ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరారు.