బిగ్ బాస్ 2లో తారక్ బుడ్డోడు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ కొడుకు పుట్టిన ఆనందంలో ఉన్నాడు. కొడుకు పుట్టిన ఆనందాన్ని అభిమానులతోనూ పంచుకొన్నాడు. తారక్ రెండో బుడ్డోడి ఫోటో కూడా బయటికొచ్చింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. తారక్ బుడ్డోడి ఫోటోని చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. అచ్చుగుద్దినట్టు తారక్ పోలికలతో ఉన్నాడని కామెంట్స్ పెడుతున్నారు.

ఇప్పుడు తారక్ బుడ్డోడు బిగ్ బాస్ హౌస్ లో కనిపించాడు. కాదు.. కాదు వినిపించాడు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ – 2 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకుంటోంది. శనివారం నాని ఎంట్రీతో షోకు ఇంకాస్త మసాల తోడైంది. హౌస్ సభ్యులకి ఈ వారం బయట జరిగిన విశేషాలని నాని వివరిస్తూ.. తారక్ మళ్లీ కొడుకు పుట్టాడనే విషయాన్ని తెలిపారు. దీంతో హౌస్ మారుమ్రోగిపోయింది.

తెలుగు బిగ్ బాస్ సీజన్ – 1కి తారక్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ సూపర్ హిట్టయ్యింది. ఐతే, తారక్ తో పోలిస్తే నాని తేలిపోయాడు. బిగ్ బాస్ సీజన్ 2 కాస్త చప్పగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీటిని నాని అంగీకరించాడు. ఐతే, రాను రాను కాస్త మసాల యాడ్ చేస్తూ షోని రక్తికట్టించే ప్లాన్ లో ఉన్నాడు. శనివారం షో కాస్త స్పైసీగా సాగింది. ఇక ముందు ముందు నాని సెట్ అవుతాడు. తారక్ రేంజ్ లో కాకున్నా… సీజన్ 2 ని హిట్ చేస్తాడని చెప్పుకొంటున్నారు.