ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాలి..!

నాలుగేళ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఉత్సాహం చూపించ‌డం లేద‌ని నిజామాబాద్ ఎంపీ క‌విత అన్నారు. సంవ‌త్స‌రం క్రితం ప‌సుపుబోర్డు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర‌మంత్రి సురేష్ ప్ర‌భును క‌లిసామ‌ని , స్పెషల్ టర్మరిక్ సెల్ కు సానుకూలంగా స్పందించార‌ని ఆమె చెప్పాఉరు. పసుపుకు మద్దతు ధర ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ప‌సుపుబోర్డు ఏర్పాటు చేయాల‌ని ఆమె అన్నారు. కేవ‌లం ఆరుశాతం మాత్ర‌మే ప‌సుపు ఎగుమ‌తులు జ‌రుగుతున్నాయ‌ని ఆమె తెలిపారు.