‘బిగ్ బాస్ 2’ తొలి వికెట్ పడింది

తెలుగు బిగ్ బాస్ సీజన్ – 2లో తొలి వికెట్ పడింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ షో తొలివారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొంది. తొలి ఎనిమినేషన్ కూడా జరిగింది. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ హోస్ లోకి వెళ్లిన సంజన ఎలిమినేట్ అయ్యింది. హోస్ లో సంజన – తేజస్వీతో మధ్య హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హోస్ నుంచి బయటికొచ్చిన తర్వాత సంజన బాబు గోగినేనిపై నిప్పులు చిరిగింది. ఆయన బయటికి కనిపించేంత మంచివారేమీ కాదది. తనకు లభించిన బిగ్ బాంబుని కూడా గోగినేనిపై విసిరింది.

ఆదివారం బిగ్ బాస్ షోలో నాన్న సెంటిమెంట్ బాగా పండింది. ఫాదర్స్ డే కావడంతో హోస్ సభ్యులు తమకు నాన్నతో తమకున్న అనుబంధాన్ని పంచుకొన్నారు. దీంతో షో కాస్త ఎమోషనల్ సాగింది. ఆ తర్వాత ఎలిమేనషన్ పాయింట్ ని చెప్పి షోని సీరియస్ మూడ్ లోకి తీసుకొచ్చారు నాని. కాస్త ఉత్కంఠ డ్రామా మధ్య సంజన హోస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు బిగ్ బాస్’ని ఓ రేంజ్ కి తీసుకెళ్లాడు. సీజన్ – 1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపాడు. ఇప్పుడీ బాధ్యతని నేచురల్ స్టార్ నాని తీసుకొన్నాడు. ఐతే, ఎన్ టీఆర్ రేంజ్ లో నాని అదరగొట్టడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐతే, క్రమ క్రమంగా ఆ ముద్ర నుంచి నాని బయటపడుతున్నాడు. తొలి వీకెండ్ లో నాని షోని కాస్త స్పైసీగా రన్ చేసినట్టు అనిపించింది. ఇక ముందు ఇంకాస్త మసాల యాడ్ చేస్తే నాని బిగ్ బాస్ 2 ని నిలబెట్టినట్టే.. !