మంత్రి చెప్పిన స్కూల్స్ కి సెలవులు ఇవ్వలేదు
ఎండాకాలం పోయింది. వానలు పడ్డాయి.. వాతావరణం చల్లబడిందని ప్రజలు ఊపిరి పీల్చుకొన్నారు. పిల్లలు ఉషారుగా బడి బాట పట్టారు. ఐతే, ఈ మధ్య ఎండలు మరీ ఎకువయ్యాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బదులు పడుతున్నారు. ఇటీవలే ఓ విద్యార్థి ఎండతీవ్రతని తట్టుకోలేక మృతి చెందాడు. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. పాఠశాలకు మరో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకొంది. దీనికి మంత్రి గంటా సోమవారం ప్రకటన చేశారు.
మంత్రి ప్రకటనని స్కూల్ యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇవాళ పాఠశాలలని తెరిచారు. విద్యార్థులు స్కూల్స్ కి వచ్చేశారు. కార్పోరేట్ పాఠశాలలో అత్యధికంగా తెరుచుకొన్నాయని చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు వెళ్లి అడిగితే.. మాకు సమాచారం అందడంలో ఆలస్యమైంది. ఈరోజే ఆఫ్ డే నిర్వహించి.. రేపు ఎల్లుండి సెలవులు ఇస్తామని చెబుతున్నారు.