ఆ సంగీత దర్శకుడితో మహేష్’కు విబేధాలు !
సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సరదా మనిషి. సెట్స్ లో నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాడు. తోటి హీరోలు, దర్శక-నిర్మాతలతోనూ స్నేహంగా మెసులుకొంటాడు. అలాంటి మహేష్’కు ఓ సీనియర్ సంగీత దర్శకుడితో చెడిన విషయం వెలుగులోకి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు మురారి, ఒక్కడు, అతడు, అర్జున్, పోకిరి, ఖలేజా సినిమాలకు మణిశర్మ సంగీతం అందించారు. ఐతే, ప్రస్తుతం వీరి మధ్య సంబంధం అంత బాగా ఏమీ లేవు.
ఈ విషయాన్ని స్వయంగా మణిశర్మ నే తెలిపారు. ఓ టీవీ స్పెషల్ షోలో పాల్గొన్న మణిశర్మ మహేష్ విషయంలో ఓపెన్ అయిపోయారు. మహేష్ తో తనకు మంచి అనుబంధం ఉండేది. ఆ తర్వాత అనుకోకుండా చిన్న డిస్టర్ బెన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. మణిశర్మ సంగీతం అందించిన చివరి స్టార్ హీరోల సినిమాలు ఖలేజా, తీన్ మార్, శక్తి. ఇప్పుడు స్టార్ హీరోలెవ్వరు మణిశర్మ వైపు చూడటం లేదు. ఎందుకనే విషయం తనకి అర్థకావడం లేదని చెప్పారు మణి. ఇంతకీ మహేష్-మణిశర్మల మధ్య జరిగిన ఆ చిన్ని డిస్టర్ బెన్స్ అనేది ఏంటీ అనేది ఏంటో ? తెలియాల్సి ఉంది.