మంత్రి గంటా అలక వెనక.. !
ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ అలక బూనారు. మంగళవారం అమరావతిలో జరిగిన ఏపీ కేబినేట్ సమావేశానికి డుమ్మా కొట్టారు. దీంతో గంటా అలక వెనక అసలు కారణలేంటీ ? అని తెలుసుకొంటే షాకింగ్ విషయాలు తెలిశాయి. గంటాది అలక కాదట. ఆయన తీవ్ర మస్తాప్తానికి గురైనట్టు తెలుస్తోంది. దీనికి కారణం సొంత పార్టీ నేతల వ్యవహార శైలియే కారణమని తెలుస్తోంది.
గత రెండేళ్లుగా గంటాకు వ్యతిరేకంగా పార్టీలో కొన్ని పరిణామాలు జరుగుతున్నాయట. వాటిని ఆధారలతో సహా అధినాయకత్వం ముందుంచారట గంటా. ఐనా.. ఎలాంటి ఫలితం లేదట. విశాఖ భూకుంభ కోణంలో గంటాని కావాలనే సొంత పార్టీలు ఇరిక్కించారట. ఆ తర్వాత భూముల కుంభకోణంపై గంటా ప్రమేయం లేదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదికలో పేర్కొంది. ఇప్పుడీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. దాన్ని ప్రభుత్వం బయటపెట్టడం లేదు. ఇదీగాక, ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలలో గంటాకు తన నియోజవర్గంలో వ్యతిరేకత ఉన్నట్టు చూపిస్తున్నారు. ఈ అంశాలన్ని గంటాని మనస్తానికి గురిచేశాని చెబుతున్నారు.
ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ వెళ్లనున్నారు. ఈ పర్యటనకు గంటా హాజరుకావాలా ? వద్దా.. ? అనేది ఆలోచిస్తున్నారు. ఒకవేళ గంటా ముఖ్యమంత్రి పర్యటనకు హాజరుకాకపోతే.. పరిస్థితి చేయి దాటినట్టేనని చెబుతున్నారు. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న ఆయన వైకాపా తీర్థం పుచ్చుకోవడం నిజంకావొచ్చని చెబుతున్నారు. మరీ.. గంటాని టీడీపీ అంత ఈజీగా వదులుకుంటుందా.. ? అనేది చూడాలి.