ప్రభాస్, అనుష్కలది.. ఒక్కటే మాట !
ప్రభాస్ – అనుష్కలకు లింకు పెడుతూ ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పుకొన్నారు. ఆ తర్వాత ఈ ప్రచారాన్ని ప్రభాస్, స్వీటీ ఇద్దరూ ఖండించారు. మేం మంచి ఫ్రెండ్స్ అంటూ కటింగ్ ఇచ్చారు. ఐతే, ఈ మధ్య మరోసారి స్వీటీకి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ప్రభాస్ కు భీమవరం అమ్మాయి దొరికేసిందంటూ వార్తలొచ్చాయ్. ఈ నేపథ్యంలో ప్రభాస్-స్వీటీ పెళ్లి న్యూస్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై ఇటీవలే ప్రభాస్ ఘూటుగా స్పందించారు. పెళ్లి అనేది నా పర్సనల్. దానిపై నేను స్పందించను. నా పెళ్లి కుదిరితే.. ఆ విషయం నేనే స్వయంగా చెబుతానని సీరియస్ గా చెప్పాడు. ఆ తర్వాత రెండు మూడురోజులకే స్వీటీకి కూడా పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ తో పెళ్లి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని మరోసారి స్పష్టం చేసింది. దీంతో ప్రభాస్-అనుష్కలు ఒకే మాటపై ఉన్నారని చెప్పుకొంటున్నారు.