పరువునష్టంపై రమణదీక్షితులు ఫైర్

తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందుకు వచ్చారు. తనపై టీటీడీ వేసిన వందకోట్ల పరువు నష్టం దావాపై ప్రశ్నించారు. తాను చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేకే తనపై పరువునష్టం దావా వేశారు. స్వామివారి పరువు వంద కోట్లే అని తేల్చేశారు. తాను చేసిన ఆరోపణలు తప్పని టీటీడీ నిరూపించాలి. ఆ తర్వాతే తనపై పరువునష్టం దావా వేయాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో టీటీడీ సంపద గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. శ్రీనివాసుడి మహిమలు అపారమైనవి. స్వామి గురించి పురాతన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న వివరాలు తెలుసుకుంటే భక్తులకు మతిపోవడం ఖాయం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర రాజ్యాధిపతిగా తిరుమలరాయలు శ్రీవారిని దర్శించుకుని సుమారు 1000 ఏనుగులు, 30 వేల అశ్వాలపై అమూల్యమైన సంపదలను తిరుమలకు తీసుకు వచ్చి ఎక్కడో నిక్షిప్తం చేశారు. ఈ విషయం మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తోంన్నారు. ఆ సంపదనంతా కొన్ని ప్రదేశాల్లో సామాన్యుల ఊహకు అందని విధంగా నిక్షిప్తం చేశారని చెప్పుకొచ్చారు.