‘సైరా’ ఆలస్యానికి చరణ్ నే కారణం.. !

సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘బాహుబలి’ సినిమా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. విజయం ఆ రేంజ్ లో దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకొంటున్న ‘సైరా’ని వచ్చే యేడాది సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకొన్నారు. ఐతే, చరణ్ కారణంగా ‘సైరా’ విడుదల ఆలస్యమవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారమ్.

‘సైరా’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్.. హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకొన్నారు. కొన్ని కారణాల వలన చరణ్ సినిమా సంక్రాంతికి వాయిదా పడింది. దీంతో మెగాస్టార్ ‘సైరా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకొంది. సమ్మర్ కు వెళ్లిందని చెప్పుకొంటున్నారు. మెగాస్టార్ సినిమా వాయిదా పడినందుకు మెగా అభిమానులు బాధపడినా.. ఆ స్థానంలో చరణ్ వస్తుండటంతో సంతోషిస్తున్నారు.

స్వాత్యంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితచరిత్ర ఆధారంగా ‘సైరా’ తెరకెక్కుతోంది. చిరు సరసన నయనతార జతకట్టనుంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ సినిమా ఉండబోతుందని చెబుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ సినిమా కోసం స్క్రిప్టుని రెడీ చేసే పనిలో కొరటాల ఉన్నారు.