వెంకీ మరదలుతో వరుణ్ తేజ్ పెళ్లి
మెగా అభిమానులకు గుడ్ న్యూస్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి సెట్టయ్యింది. విక్టరీ వెంకటేష్ మరదలుని వరుణ్ పెళ్లాడబోతున్నాడు. దీంతో వెంకీ, వరుణ్ తేజులు తోడల్లుళ్లుగా మారబోతున్నారు. ఐతే, ఇది రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో జరగబోతుంది. అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో వెంకీ-వరుణ్ ల మల్టీసారర్’గా ‘ఎఫ్2’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడీ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 23న ఘనంగా సినిమా ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. ఈ నెల 30 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలుకానుంది. హైదరాబాద్ లోనే ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. నాన్ స్టాప్ గా 20రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ మల్టీస్టారర్ లో వెంకీ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ జతకట్టనున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్. దిల్ రాజు నిర్మాత.