మహేష్’తో ఇంద్రగంటి సినిమా ?

దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ సినిమాలు విభిన్నంగా ఉంటాయి. గ్రహణం నుంచి సమ్మోహనం వరకు ఆయన అదే పంథాని ఎంచుకొన్నారు. ఈ క్రమంలో జూ. జంధ్యాల అని పేరు తెచ్చుకొన్నాడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇంద్రగంటి ‘సమ్మోహనం’ విమర్శకుల ప్రసంశలు అందుకొంటోంది. కలెక్షన్స్ లోనూ అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లోనూ సత్తా చాటుతోంది. ఇప్పటికే ‘సమ్మోహనం’ హీరోయిన్ అదితి రావ్ హైదరి మహేష్ 25వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పుడీ చిత్ర దర్శకుడు ఇంద్రగంటికి మహేష్ ఛాన్స్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకొంటున్నారు.

‘సమ్మోహనం’ సినిమా చూసిన మహేష్ సినిమాపై ప్రశంసలు కురిపించారు. చిత్రబృందాన్ని అభినందించారు. అంతేకాదు.. ఇటీవలే సుధీర్ బాబుతో మహేష్ బాబు పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఇంద్రగంటి ప్రస్తావన తీసుకొచ్చారట. ఇంద్రగంటి మేకింగ్ స్టైల్ గురించే అరగంటకు పైగా మాట్లాడారట. ఇదీగాక, ఇటీవలే ఇంద్రగంటితో మహేష్ భార్య నమ్రత చాలా సేపు చర్చలు జరిపినట్టు వార్తలొచ్చాయ్. ఈ చర్చల్లో మహేష్ తో సినిమా గురించి ఇంద్రగంటి ప్రస్తావన తీసుకొచ్చాడట. మహేష్ కూడా ఇంద్రగంటితో సినిమా చేసేందుకు ఆసక్తిచూపుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇంద్రగంటితో మహేష్ సినిమా రావొచ్చని చెబుతున్నారు.