జగన్’ని టార్గెట్ చేసిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వైసీపీ అధినేత జగన్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. చాన్నాళ్ల తర్వాత రాహుల్ గాంధీ ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి నేతలకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో జగన్ ని టార్గెట్ చేయమని చెప్పడం ఆకట్టుకుంటోంది. దీని వెనక ఉన్న లాజిక్ ని కూడా ఏపీ కాంగ్రెస్ నేతలకు వివరించారు రాహుల్.
‘వైయస్ రాజశేఖర్ రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. వైయస్సార్ పాలన కూడా పేదల సంక్షేమం లక్ష్యంతోనే సాగింది. కానీ, జగన్ అలా కాదు. ఆయన వ్యక్తిగత లక్ష్యలతోనే రాజకీయాలు చేస్తున్నారు’ అన్నారు రాహుల్. ప్రస్తుతం వైసీపీలో కొనసాగే నేతల్లో కాంగ్రెస్ స్వభావం ఉన్నవారే ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైకాపాలో ఇమడలేక సతమతవుతున్న నేతలని తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలని రాహుల్ సూచించారు. ఇందులో విజయం సాధిస్తే.. ఏపీలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదని రాహుల్ గాంధీ నేతలతో చెప్పినట్టు తెలుస్తోంది. మరీ.. ఏపీలో రాహుల్ వ్యూహం ఫలిస్తుందేమో చూడాలి.