బాలయ్యకు వ్యతిరేకంగా.. మెగా ఫ్యామిలీ !

నటసింహం బాలకృష్ణకు వ్యతిరేకంగా మెగా ఫ్యామిలీ వ్యవహరిస్తున్నట్టు చెప్పుకొంటున్నారు. హీరోగా, ఎమ్మెల్యేగానూ బాలయ్య న్యాయం చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ మళ్లీ హిందూపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య ప్రత్యర్థి రామ్ చరణ్ అని తేలిపోయింది. ఐతే, ఇది రాజకీయాల్లో కాదు. సంక్రాంతి రేసులో. అవును.. సంక్రాంతికి బరిలోకి దిగడం బాలయ్యకు మహా ఇష్టం. 2017 సంక్రాంతి రేసులో బాలయ్యకు ప్రత్యర్థిగా మెగాస్టార్ స్టార్ చిరంజీవి బరిలోకి దిగారు. గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీ నెం. 150 రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఐతే, కమర్షియల్ గా చిరుదే పై చేయి అయ్యింది.

ఇప్పుడు వచ్చే యేడాది సంక్రాంతి రేసు గురించే అప్పుడే హాట్ హాట్ చర్చ మొదలైంది. మరోసారి బాలయ్య-చిరుల సంక్రాంతి రేసు తప్పదనుకొన్నారు. వినాయక్ దర్శకత్వంలో రాబోతున్న బాలయ్య సినిమాని సంక్రాంతికి తీసుకురానున్నారు. మెగాస్టార్ ‘సైరా’ సంక్రాంతికి రావాలనుకొన్నాడు. ఐతే, సైరా సమ్మర్ కు వెళ్లింది. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రామ్ చరణ్ సినిమా దసరా నుంచి సంక్రాంతికి మారడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఐతే, మెగాస్టార్ కు బదులుగా బాలయ్య పత్యర్థిగా రామ్ చరణ్ మారడం ఆకట్టుకుంటోంది. మరీ.. బాలయ్య దాడిని తట్టుకొని చరణ్ విజయం సాధిస్తాడేమో చూడాలి.