‘టిక్ టిక్ టిక్’ ఎలా ఉందంటే ?

శక్తి సౌందర రాజన్ దర్శకత్వంలో జయం రవి – నివేదా పేతురాజ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘టిక్ టిక్ టిక్’. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలో తొలి అంత‌రిక్ష సినిమాగా తెరకెక్కిన చిత్రమిది. అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్ వర్క్‌తో పాటు, థ్రిల్ కలిగించే సౌండ్ ఎఫెక్ట్‌తో ‘టిక్ టిక్ టిక్’ రెడీ అయ్యింది. ‘బిచ్చగాడు’ నిర్మాత చదలవాడ బ్రదర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకొచ్చారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఒక గ్రహానికి సంబంధించిన ఆసక్తికరమైన నోట్ తో సినిమా మొదలైంది. భారత వైమానిక దళం ఒక మిషన్ ను స్టార్ట్ చేసింది. భూమికి మరింత నష్టాన్ని ఆపడానికి నివారణ చర్యలను ప్రారంభించడమే ఈ మిషల్ లక్ష్యం. హీరో జయం రవి ఎస్కేప్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. సినిమాలో గ్రాఫిక్స్ వర్క్స్ హైలైట్ గా ఉన్నాయి. కథలో వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. సీనియర్స్ నడిచే ఆపరేషన్ మధ్య మధ్యలో ప్రేక్షకుడు రిలీఫ్ కోసం కొన్ని కామెడీ సీన్స్ వచ్చి వెళ్లాయి. మొత్తంగా కథ సీరియస్ గా, ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా టిక్ టిక్ టిక్ ఉందని చెబుతున్నారు.