తారక్ కోసం త్రివిక్రమ్ తగ్గాడు
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అస్సలు తగ్గడని చెబుతుంటారు. తాను ఇష్టపడి రాసుకొన్న కథని తనకి నచ్చిన విధంగా తెరకెక్కిస్తారు. అవి ప్రేక్షకులకు కూడా నచ్చుతాయనుకోండి. సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత కథని, క్లైమాక్స్ ని మార్చేందుకు ఇష్టపడడు. అలా మార్చాలని ఇబ్బంది పెట్టే హీరో, నిర్మాతలతో త్రివిక్రమ్ అసలు సినిమానే చేయడు. త్రివిక్రమ్ సినిమాలన్నీ హారిక అండ్ హాసిని బ్యానర్ లో వస్తుంటాయి. నిర్మాత రాథాకృష్ణ త్రివిక్రమ్ పూర్తిని స్వేచ్ఛని ఇస్తారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో త్రివిక్రమ్ చెప్పిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఎంత అంటే అంతే. అలాంటి త్రివిక్రమ్ తారక్ కోసం తగ్గడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ ‘అరవింద సమేత’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాని తన వైఖరి భిన్నంగా జెడ్ స్వీడుతో పూర్తి చేసే పనిలో త్రివిక్రమ్ ఉన్నారు. ఇదీగాక, తారక్ కోరినట్టు, నచ్చినట్టు ఈ సినిమాలో మార్పులు, చేర్పులు చేస్తున్నాడట. వాస్తవానికి ఈ సినిమా టైటిల్ ‘అరవింద సమేత’ అనుకొన్నారు త్రివిక్రమ్. ఐతే, టైటిల్ క్లాస్ గా ఉందని తారక్ అనడంతో దానికి ‘వీర రాఘవ’ తగిలించి మాస్ టచ్ ఇచ్చాడట. ఇప్పుడు తారక్ కోసం ఏకంగా క్లైమాక్స్ నే మార్చేసినట్టు సమాచారమ్.
సాధారణంగా త్రివిక్రమ్ సినిమా క్లైమాక్స్ ని క్లాస్ టచ్ తో ముగిస్తారు. ఓ భారీ ఎమోషనల్ సీన్ తో శుభం కార్డ్ వేస్తారు. అత్తారింటికి దారేది, అ ఆ సినిమాల్లో అదే చేశాడు. ఇప్పుడు తారక్ ‘అరవింద సమేత’ క్లైమాక్స్ కోసం ఇలాంటి ఎమోషనల్ సీన్ ని రాసుకొన్నాడట. ఐతే, తారక్ కోరడంతో.. క్లైమాస్ ని మార్చేసినట్టు తెలుస్తోంది. క్లైమాక్స్ కోసం ఓ హెవీ యాక్షన్ ఏపీసోడ్ ని రాసుకొన్నట్టు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే తారక్ కోసం తగ్గాడని చెప్పుకొంటున్నారు. త్రివిక్రమ్ చెప్పినట్టుగా ‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన హీరో’. ఇక్కడ త్రివిక్రమ్ అంతే.