ఎన్టీఆర్ సినిమాలో చైతూ

ఎన్టీఆర్ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కనిపించబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో మహానటుడు ‘ఎన్టీఆర్’ బయోపిక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటించనున్నారు. చంద్రబాబు నాయుడు పాత్ర కోసం రానా దగ్గుపాటిని తీసుకొన్నారు. ఇప్పుడు ఏఎన్నార్ పాత్ర కోసం నాగ చైతన్యని తీసుకొన్నట్టు తెలిసింది. ఇప్పటికే దర్శకుడు క్రిష్ చైతూ కలిసి మాట్లాడటం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయట. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మహానటి’ బయోపిక్ లో చైతూ తాత పాత్రలో కనిపించి ఆకట్టుకొన్నాడు. ఇప్పుడు మహానటుడు ఎన్టీఆర్ కోసం మళ్లీ తాత పాత్రలో కనిపించబోతున్నాడు.

ఎన్టీఆర్, ఏఎన్నార్ సమ ఉజ్జువులు. ఒకే సమయంలో ఇండస్ట్రీని ఏలిన మహానటులు. వీరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగేది. ఇప్పుడా మహానటులుగా బాలయ్య, నాగ చైతన్య తెరపై కనిపించబోతున్నారు. ఈ బయోపిక్ ని వచ్చే నెలలో సెట్స్ మీదకు తీసుకెళ్లి.. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎలాంటి వివాదాలకు పోకుండా ఎన్ టీఆర్ బయోపిక్ ని తీసుకురాబోతున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.