ఇప్పుడే సీఎం రాజీనామా చేస్తే ఎవ‌రైనా అడ్డుకుంటారా..!?

అధికార టీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ విమ‌ర్శ‌ల వ‌ర్శం కురిపించారు. గాంధీభవలో ఏఐసీసీ ఇంచార్జి ప్రధాన కార్యదర్శి కుంటియా, ముగ్గురు తెలంగాణ ఇంచార్జి ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీమ్ అహ్మద్, శ్రీనివాస కృష్ణన్ టీపీసీసీ ముఖ్య‌నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఇంచార్జి కార్య‌ద‌ర్శుల ప‌నివిభ‌జ‌న‌పై చ‌ర్చ జ‌రిపారు. కాంగ్రెస్ పార్టీలో కన్సల్టెంట్ కమిటీని నియ‌మించారు. జానారెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి, వి.హెచ్,పొన్నాల,దోమోదర రాజనర్సింహా లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పార్టీలో చేరికలు, నాయకులమధ్య గ్రూప్ విభేదాలు, సమస్యల పరిష్కారాల‌ను ఈ స‌భ్యులు పర్యవేక్షించ‌నున్నారు.

జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉందని, రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంతృత్వ పాలనతో విసిగిపోయారని ఉత్త‌మ్ విమ‌ర్శించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పట్టం గడతారని ఆయ‌న అన్నారు. ముఖ్యమంత్రి ప్ర‌భుత్వం రద్దు చేసుకొని ఎన్నికలకు వచ్చిన తాము సిద్ధంగా ఉన్నామ‌న్నారు. రాజీనామా చేయడానికి ప్రతిపక్షాలను అడగడం ఎందుకని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇప్పుడే గవర్నర్ కు ముఖ్యమంత్రి రాజీనామా ఇస్తే ఎవరన్నా అడ్డుకుంటారా అని ఆయ‌న అధికార పార్టీని ప్ర‌శ్నించారు.